శ్రీశైలానికి కొనసాగుతున్న వరద


Thu,September 6, 2018 01:48 AM

-ఇన్‌ఫ్లో 45,137, అవుట్‌ఫ్లో 78,401 క్యూసెక్కులు నమోదు
-జూరాలకు ఇన్‌ఫ్లో 32,000, అవుట్‌ఫ్లో 43,425 క్యూసెక్కులు
-సుంకేశుల ఇన్‌ఫ్లో 8,000, అవుట్ ఫ్లో 6,000 క్యూసెక్కులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి/అమ్రాబాద్ రూరల్ : శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయం త్రం 4గంటల వరకు 45,137 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కాగా 78,401 క్యూ సెక్కులను అవుట్ ఫ్లో నమోదైనట్లు అధికా రులు తెలిపారు. 882.80 అడుగులకు చే రుకోగా నీటిమట్టం 202.5056 టీఎంసీ లు గా నమోదైంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఎలాంటి విద్యుతుత్పత్తి జరగలే దు. ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యు దుత్పత్తి కొనసాగుతూనే ఉన్నది. కాగా తె లంగాణ జెన్‌కో పవర్ హౌస్ నుంచి 31, 783 క్యూసెక్కులు. ఏపీ పవర్ హౌస్‌కు 18, 655 క్యూసెక్కులను వదులు తుండగా, హంద్రీనివా ప్రాజెక్టు నుంచి 2,363, పోతి రెడ్డిపాడుకు 24,000 క్యూసెక్కులు, మహా త్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని వ దులు తున్నట్లు అధికారులు తెలిపారు.

జూరాలకు తగ్గుతున్న వరద
జూరాలకు క్రమక్రమంగా వరద ప్రవాహం తగ్గుతుంది. బుధవారం జురాల ఇన్‌ఫ్లో 32,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్ల్లో 43,415 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తు తం జూరాల ప్రాజెక్టులో 1,044.849 అడుగుల ఎత్తులో 9.562 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 795 క్యూసెక్కు లు, ఎడమ కాలువ ద్వారా 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పవర్‌హౌస్ ద్వారా 24,076 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా రు. భీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కు లు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కు లు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువనున్న కర్నాటకలోని ఆల్మట్టి ఇన్‌ఫ్లో 28,817క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 28,817 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ఇన్‌ఫ్లో 28, 570 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 28,417 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర డ్యా మ్‌కు స్థిరంగా వరద కొనసాగుతుంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో 17,626 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 12,093 క్యూసెక్కులు నమోదైంది. సుంకేశులకు ఇన్‌ఫ్లో 8,000 అవుట్ ఫ్లో 6,000 క్యూసెక్కులు నమోదైంది.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...