ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా..


Thu,September 6, 2018 01:47 AM

గద్వాలటౌన్: ఆరోగ్య తెలంగాణగా రాష్ర్టాన్ని తీర్చిదిద్ధేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకం విజయవంతంగా సాగుతుంది. కంటివెలుగులో తమ కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు రోజురోజుకు ఉత్సాహం చూపుతున్నారు. కార్యక్రమంలో భా గంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 శిబిరాల్లో బుధవారం జనం అధిక సంఖ్యలో పాల్లొని పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఒక్కరోజే 2819 మంది పరీక్షలు చేయించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే జి ల్లా వ్యాప్తంగా 29270మంది పరీక్షలు చేయించున్నట్లు తెలిపారు. వారిలో 3945మందికి అద్దాలను పంపిణీ చేశా రు. అలాగే 4632మందికి శస్త్ర చికిత్స అవసరమున్నట్లుగా గుర్తించి, ఆపరేషన్ల కోసం ఎస్‌వీఎస్, రామిరెడ్డి కంటి ఆసుపత్రులకు రెఫర్ చేశారు. 5567మంది కి ప్రత్యేక అద్దాలు అవసరమున్నట్లుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరికి త్వరలోనే అద్దాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న కంటి వెలుగు
అయిజ: అయిజ పట్టణంలోని దుర్గా నగర్‌లో కంటి వెలుగు శిబిరం కొనసాగుతున్నది. బుధవారం వార్డులోని ప్ర జలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారి అద్దాలను అందజే య డంతోపాటు శస్త్ర చికిత్సకు ఎంపిక చేసినట్లు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అయిజ పట్టణంలో నవంబర్ 2 వరకు కంటి వెలుగు శిబిరం నిర్వహించి ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇటిక్యాల మండలంలో..
ఇటిక్యాల: మండలంలోని ఆర్ గార్లపాడ్ గ్రామంలో రెండో రోజు కంటివెలుగు శిబిరం కొనసాగింది. ఈసందర్భంగా కంటి వైద్యురాలు ఖమురున్నిసాబేగం బుధవారం 150 మంది గ్రా మస్తులకు కంటి పరీక్షలను నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న 20మందిని గుర్తించి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే కంటి సమస్యలు తీవ్రంగా ఉన్న15 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు.
నారాయణపురంలో..
మానవపాడు: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో కంటివెలుగు శిబిరం కొనసాగుతుంది. గ్రామం లో ఇంతవరకు 272 మందికి పరీక్షలను నిర్వహించి 16 మందికి అపరేషన్లు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామని, 56 మందికి అద్దాలను అందించామని కంటివైద్యుడు వెంకటేశ్వరచారి తెలిపారు. ఆయా కార్యక్రమంలో కంటి వైద్యనిపుణుడు ఖలీల్, పీహెచ్‌ఎన్ భారతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రభాకర్,లలిత, సత్యనారాయణ, చంద్రన్న, నర్సయ్య, షాజహాన్, మాబ్‌బీ ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...