గద్వాల డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన షాకీర్ హుస్సేన్


Thu,September 6, 2018 01:47 AM

గద్వాల క్రైం : గద్వాల డీఎస్పీగా షాకీర్ హుస్సేన్ బుధవారం రాత్రి తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించిన సురేందర్‌రావు కూకట్‌పల్లి ఏసీపీగా బదిలీ కాగా సీఐడీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న షాకీర్‌హుస్సేన్‌ను ప్ర భుత్వం గద్వాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే బదిలీ అయిన సురేందర్‌రావు నుంచి షాకీర్ హుస్సేన్ బాధ్యతలు తీసుకున్నారు. షాకీర్ హు స్సేన్ 2005 నుంచి 2007 వర కు గద్వాల టౌన్ ఎస్‌ఐగా, 2013 తిరిగి గద్వాల సీఐ విధు లు నిర్వహించి ఆ తర్వాత పదోన్నతిపై లక్డీకపూల్ సీఐడీ డీఎస్పీగా పదోన్నతిపై వెళ్లారు. ఆ తర్వాత బదిలీలో భాగంగా తిరిగి గద్వాలకు వచ్చిన ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు శాంతిభద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. చట్టబద్ధంగా వ్యవహరించడమే తన కర్తవ్యమన్నారు. ఎలాంటి కేసుల్లోనైనా చట్టం ప్రకారం వ్యవహరిస్తానన్నారు. కేసులో విషయంలో రాజకీయ జోక్యం ఉండరాదనేది తన సిద్ధాంతమన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన షాకీర్‌హుస్సేన్‌కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...