పండుగలు మత ప్రతీకలు


Wed,June 20, 2018 02:29 AM

-ఆధ్వర్యంలో ఈద్‌మిలాప్
స్టేషన్ మహబూబ్‌నగర్ : పండుగలు మతసామరస్వానికి ప్రతీకలు అని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అల్మాస్ ఫంక్షన్ హాలులో ఈద్‌మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లింలు సోదర భావంతో కలిసి ఉండాలని, ఈద్ మిలాప్ లాంటి కార్యక్రమాలు ఇందుకు వేదికలన్నారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని,రంజాన్ మాసంలో ఇఫ్తార్, బట్టల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధ్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలిక్ మొతసీమ్‌ఖాన్ రంజాన్ ప్రాముఖ్యతతోపాటు ఇస్లాం ప్రాముఖ్యతను గురించి వివరించారు. సేమియాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఖాజాపాషా, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్, టీఆర్‌ఎస్ నాయకులు మక్సూద్ హుస్సేన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌హదీ, ఖుద్దుస్‌బేగ్ జేఐహెచ్‌పట్టణ అధ్యక్షుడు సుజాత్ అలీ,నాయకులు ఎన్పీ వెంకటేశ్, సత్యనారయణ, కురుమూర్తి, జాకీర్‌అడ్వకేట్, జఫరుల్లాసిద్దిఖీ, మోసీన్‌ఖాన్, నూరుల్‌హసన్, తఖీహుస్సేన్, ఖుద్దూస్‌బేగ్, అబ్రారర్‌పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...