ప్రతి ఎకరాకూ సాగునీరు


Wed,June 20, 2018 02:29 AM

-ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కోయిలకొండ ప్రతి ఎకరాకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. గొలుసు కట్టు ద్వారా మండలంలో 5 చెరువులకు నీరు అందించే గొండ్యాల లిఫ్ట్ కాలువకు రూ.5 80 టెండర్లకు ఆహ్వానించడం జరిగిందని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మండలంలోని ఇబ్రహీంనగర్, జమాల్‌పూర్, బూర్గుపల్లి, మనికొండ గ్రామాల్లో రూ. కోటి 30 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్లు, ఇంటింటికి కులాయి తాగునీరు, కమ్యూనిటీ భవన పనులకు శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నియోజక వర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పాలమూరు ఎత్తిపోతల పథకంలో కర్వెన రిజర్వాయర్ నుంచి మొదటి దశలో సాగునీరు అందించడం జరుగుతుందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందని వెల్లడించారు. పథకంలో నియోజక వర్గంలో ఇప్పటి వరకు 43వేల గొర్రెలను అందించడం జరిగిందన్నారు. లోవోల్టేజీ సమస్యను పరిష్కరించుటకు నూతనంగా 21 సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 80 కోట్లతో ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రా టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నవోదయ సంస్థ చైర్మన్ ఎస్.రవీందర్‌రెడ్డి, ఎంపీపీ స్వప్న, వైస్ ఎంపీపీ శారద, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనువాస్‌రెడ్డి, మండల రైతు కన్వీనర్ మల్లయ్యయాదవ్ సర్పంచ్‌లు హనుమమ్మ, పార్వతి, ఆంజనేయులు, సువర్ణరాజు, ఎంపీడీవో మంజుల టీఆర్‌ఎస్ నాయకులు భీంరెడ్డి, కృష్ణయ్య, గోపాల్‌గౌడ్, గోరిసతీష్, చెన్నయ్య, రైస్‌మిల్ రాజు పాల్గొన్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...