100 శాతం భూ ..పూర్తి చేయాలి


Wed,June 20, 2018 02:29 AM

మక్తల్, నమస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమాన్ని 100 శాతం తప్పులు లేకుండా పూర్తి చేసి రైతులకు పట్టేదారు పాసుపుస్తకాలను అందిస్తామని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం నాడు మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో భూప్రక్షాళన, రైతు బీమా పథకంపై కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బందితో రెవెన్యూ, వ్యవసాయశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మక్తల్ మండలంలోని 39 రెవెన్యూ గ్రామాల్లో ఎన్ని పట్టేదారు పాసుపుస్తకాలకు బీమా చేసుకున్నారో అడిగి మండలంలోని లింగంపల్లి, మస్తాన్‌గౌడ్ గ్రామాల్లో పట్టేదారు పాసుపుస్తకాల కంటే చెక్కులను ఎందుకు అదనంగా అందించారనే పూర్తి వివరాలను అందించాలని ఆయా గ్రామాల వీఆర్వోలను, ఏఈవోలను ఆదేశించారు. గ్రామంలో ఎన్ని పట్టేదారు పాసుపుస్తకాలు వచ్చాయి అనే పూర్తి సమాచారం అందించాలని ఆదేశించగా అందుకు వీఆర్వోలు తమ దగ్గర ఉన్న సమాచారం కలెక్టర్‌కు నివేదించగా సమాచారం సరైన రీతిలో లేకపోవడంతో కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామ వీఆర్వో, విస్తరణ అధికారులు కలిసి పట్టేదారు పాసుపుస్తకాలను, రైతు బంధు చెక్కులను క్షుణంగా పరిశీలించిన అనంతరం రైతులకు అందించాలని గతంలో సూచించడం జరిగిందని అధికారులు ఇష్టారాజ్యంగా పంపిణీ చేయడం వల్ల రైతుల నుంచి అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయని కలెక్టర్ వీఆర్వోలకు సూచించారు.

రెండు రోజుల్లోగా ప్రతి రైతు సమాచారం రెవెన్యూ యాప్‌లో అప్‌డెట్ చేయాలన్నారు. రెవెన్యూ యాప్‌లో సకాలంలో అప్‌డెట్ చేయని వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 83 శాతం పట్టేదారు పాసుపుస్తకాల రైతులకు అందించడం జరిగిందన్నారు. మిగిలిన 15 శాతంలో 12 శాతం రైతులు పాసుపుస్తకాలను తీసుకోలేదు అని 7 శాతం తప్పులు ఉండటం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన 7 శాతం తప్పులను త్వరలోనే సవరించి ధరణి సైట్‌లో అప్‌డేట్ చేసి రైతులకు పట్టేదారు పాసుపుస్తకాలను అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. చనిపోయిన రైతుల పేరు మీద ఉన్న ఖాతా నెంబర్‌లను విరాసత్ కోసం వచ్చిన అప్లికేషన్‌లను పరిశీలించి త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సహయం చెక్కులను అందిస్తామని సూచించారు. పార్ట్ 1లో ఉన్నటువంటి అప్లికేషన్‌లను పరిశీలించి ధరణి సైట్ ద్వారా రైతులకు ప్రొసిడింగ్‌లను అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 11 నుండి ప్రారంభించిన రైతు బీమా నామినీ వివరాల సేకరణలో వ్యవసాయాధికారులు పకడ్బందిగా నిర్వహించి రైతులకు నామినీ వివరాల పత్రాలను అందజేయాలని సూచించారు. వీధుల పట్ల రెవెన్యూ, వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ రాజీవ్‌రెడ్డి, వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, నాయబ్ తహసీల్దార్ సురేష్‌కుమార్, ఆరైలు మధన్‌మోహన్‌రెడ్డి, సురేష్, వీఆర్వోలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...