20న మంత్రి పోచారం రాక


Tue,June 19, 2018 02:57 AM

-రైతు సమన్వయ సమితీల సభ్యులతో సమావేశం
-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈనెల 20న జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతు సమన్వయ సమితీల సభ్యులతో మంత్రి సమావేశం కానున్నారు. ఈ మేరకు సోమవారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమావేశం నిర్వహణ ఏర్పాట్లను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత మేలు చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యుల ఉమ్మడి జిల్లా సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సమన్వయ సమితీ సభ్యులు ఎంత మేరకు వస్తున్నారో ముందస్తుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశం సజావుగా జరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్‌గౌడ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారిణి సుచరిత, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య తదితరులు ఉన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...