గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా..


Mon,June 18, 2018 03:05 AM

రాజాపూర్ : గిరిజనుల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ.లకా్ష్మరెడ్డి అన్నారు. ఆదివారం బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఊటకుంట తండాలో పర్యటించారు.తండాను ప్రత్యే క పంచాయతీగా ఏర్పాటు చేసినందుకు తండాకు చెందిన మొత్తం 50 కుటుంబాల గిరిజనులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి మంత్రి టీఆర్‌ఎస్‌లోకి ఆ హ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో గిరిజనులది ప్రత్యేక పాత్ర అని అన్నారు. గిరిజనుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలుగా మారితేనే అభివృద్ధి సాధిస్తాయనే సంకల్పంతోనే అర్హత కల్గిన ప్రతి తండాను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. గిరిజన జనాభా అధికంగా కలిగిన ఉమ్మడి బాలానగర్ మండలంలో 30 కొత్తగా తండాలు జీపీలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన తండాలకు ప్రభుత్వం తగినన్ని నిధులు సమకూర్చి తండాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...