గొల్లత్త గుడి విశిష్టతను.. కాపాడుదాం


Wed,July 26, 2017 02:50 AM

-ప్రాముఖ్యతను వెలికితీసేందుకు డైరెక్టర్ విశాలచి
జడ్చర్ల రూరల్ : వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన గొల్లత్తగుడి ప్రాముఖ్యతను కాపాడేందుకు అధ్యయనం చేస్తున్నామని పురావస్తు శాఖ డైరక్టర్ విశాలాచి అన్నారు. మంగళవారం జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామశివారులో గల గొల్లత్తగుడిని అనురాధానాయక్‌తో కలిసి ఆమె సందర్శించారు. గుడి నిర్మాణానికి వాడిన ఇటుకలను, గుడి ప్రాంగణంలోని చరిత్ర కలిగిన రాళ్లను, మట్టికుండలను వారు పరిశీలించారు. గుడి చుట్టు దాదాపు 10 కిలోమీటర్ల మేర చరిత్ర కారులు నివసించిన ప్రదేశాలలో మట్టికుండల నమూనాలను వారు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గొల్లత్తగుడి దక్షిణ భారత దేశంలో ఇదొక్కటే ఉందన్నారు. త్వరలోనే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గొల్లత్త గుడి ప్రాంగణంలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు పనులు చేపడతారని అన్నారు. గుడి ప్రాంగణం వెలుపల గల పాదాల గుట్ట దగ్గర ఉన్న చరిత్రను కూడ తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుడి ఎదురుగా గల పంటల పొలాలో వ్యవసాయం చేస్తుండగా జైనులు వాడిన మట్టికుండల అవశేషాలను వారు గుర్తించి వాటిని మ్యూజియంలో పెట్టేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం పంటల సీజన్ కావడంతో రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నందున పంటనూర్పిడి అనంతరం ఆయా పొలాలోకూడ సైంటిఫిక్ క్లియరెన్స్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రంగాచార్యులు, అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, మండల ఉపధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

అధికారులు బాధ్యతతో పని చేయాలి
అధికారులు బాధ్యతతో పని చేసి హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలని మండల ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈవో కొమురయ్య అన్నారు. ఱమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఈవో కొమురయ్య మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమిష్టిగా రాణిస్తేనే హరితహార నెరవేరుతుందన్నారు. శాఖల అధికారులు సమావేశానికి రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయా శాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, సాయిలక్ష్మీ, లత, రాంబాబు, సూపర్‌వైజర్ బిపాస, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సీఎం అందజేత
పాలమూరు వైద్య సేవలు పొందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం అందజేశారు. జిల్లాకేంద్రంలోని షాషాబ్‌గుట్ట హైస్కూల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ చెక్కులను అందజేశారు. వీరన్నపేటకు చెందిన శాంతయ్యకు రూ.2.5 లక్షలు, వెంకటాపూర్‌కు చెందిన రాజన్నకు, రూ.37వేలు, శివశక్తినగరకు చెందిన సుజాతకు రూ.56వేలు, హన్వాడ బీసీ కాలనీకి చెందిన షమీమ్‌బేగంకు రూ.9500ల చెక్కులను అందజేశారు.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...