నేడు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదినం

Sun,November 17, 2019 02:47 AM

-శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు, పీఎం నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు శుభాకాక్షలు తెలిపారు. ఈ మేరకు కెప్టెన్‌కు శుభాకాంక్ష లేఖ పంపించారు. వీరితో పాటు పలువు రు భారత ఆర్మీ అధికారులు కూడా బర్త్‌డే విషెష్ తెలిపారు. 81వ జన్మదినం జరుపుకుంటున్న కెప్టెన్ మొదటగా కెప్టెన్ హోదాలో భారత సైన్యం లో పని చేశారు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక సొంత గ్రామమైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురంలో వ్యవసాయం చేశారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ఆ ప్రాంతంలో ముందుగా కెప్టెన్ మొదలు పెట్టడం విశేషం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ముందుగా సర్పంచ్‌గా, ఎంపీటీసీగా స్వగ్రామానికి సేవలందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పని చేశారు. గతంలో కెప్టెన్ సోదరుడు వొడితల రాజేశ్వర్‌రావు ఎంపీగా ఉన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles