వెంకటాపూర్, నవంబర్ 16 : యోగ, సహజ జీవన విధానం (నేచర్ లైఫ్)పై అవగాహన కల్పించేందుకు కేరళ రాష్ర్టానికి చెందిన మిల్జో థామస్ చేపట్టిన సైకిల్ యాత్ర రామప్పకు శనివారం చేరుకుంది. జీవన విధానం, యోగాపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 21న కేరళలో 24 ఏళ్ల థామస్ యాత్ర చేపట్టారు. 29 రాష్ర్టాలను చుట్టేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు ప ర్యటనకు బయలుదేరాడు. బెంగుళూరు, చెన్నై, తిరుపతి మీదుగా సైకిల్‌పై ప్రయానిస్తూ రామప్పకు శనివారం చేరుకున్నాడు. రోజూ 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం జాతీయ రహదారుల నుంచే కాకుండా మారుమూల గ్రామాలకు వెళ్తూ స్థానిక ప్రజలకు యోగా, నేచరల్ లైఫ్‌పై అవగాహన కల్పిస్తున్నాని వివరించారు.
ఇప్పటికే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లో ఇదే తరహా యాత్రలు పూర్తి చేశానని తెలిపాడు. 2020 డిసెంబర్ వరకు యాత్ర పూర్తి అవుతుందని, యాత్ర పూర్తయితే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధిస్తానని థామస్ ధీమా వ్యక్తం చేశాడు.