రేపు మంత్రి సత్యవతి రాథోడ్ రాక

Sat,November 16, 2019 03:59 AM

-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, నవంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండీ ఆయూబ్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 6 గంటలకు : సోమాజిగూడా, హైదరాబాద్ నుండి బయల్దేరుతారు.
ఉదయం 9.30 గంటలకు : మహబూబాబాద్ ఆర్‌అండ్ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.
ఉదయం 10 గంటలకు : ట్రైబల్ వెల్ఫేర్ హైస్కూల్, జూనియర్ కళాశాల (బాలుర)ను ప్రారంభించనున్నారు.
ఉదయం 10.30 గంటలకు: జూనియర్ కాలేజీ టీడబ్ల్యూఆర్‌జేసీ అదనపు గదులకు శంకుస్థాపన.

ఉదయం 11 గంటలకు: మహబూబాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల (బాలుర) డార్మెట్రీ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు: బయ్యారం నుంచి కోటగడ్డ బీటీరోడ్డుకు శంకుస్థాపన.
మధ్యాహ్నం 12.30 గంటలకు: గౌరారం నుంచి ముత్యాలమ్మగూడెం ఎక్స్‌రోడ్ వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన
మధ్యాహ్నం 1 గంటకు: ఉప్పలపాడు హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన, బహిరంగ సభ, భోజన విరామం.
మధ్యాహ్నం 3 గంటలకు : ఉప్పలపాడులో పర్యటన
మధ్యాహ్నం 3.30 గంటలకు: ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ మహబూబాబాద్‌కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 4 గంటలకు : మహబూబాబాద్ నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌లోని సోమాజీగూడకు చేరుకుంటారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles