తొర్రూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం

Sat,November 16, 2019 03:58 AM

-స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో ఈశ్వరయ్య
తొర్రూరు, నమస్తే తెలంగాణ, నవంబర్ 15 : రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే విధం గా ప్రభుత్వం పీఏసీఎస్‌లు, ఐకేపీల ద్వారా కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేసి పక్కాగా సమాచారాన్ని సేకరించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా తొర్రూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తుండగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిషనర్‌కు నివేదిక అందించేందుకు ఆర్డీవో ఈశ్వరయ్య, పీఏసీఎస్ చైర్మన్ నకిరకంటి కొమురయ్య, ఎంపీపీ చిన్న అం జయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ రమేశ్‌బాబు మార్కెట్ యార్డును పరిశీలించారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles