పరిమితికి మించిన ప్రయాణం.. ప్రమాదం

Sat,November 16, 2019 03:58 AM

మహబూబాబాద్ రూరల్, నవంబర్ 15 : ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి ప్రధాన రహదారిపై రూరల్ ఎస్సై రమేశ్‌బాబు వాహనాలను తనిఖీ చేశారు. గురువారం ప్రమాదం అని తెలిసినా అనే కథనానికి స్పందించిన పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలు, టాటా మ్యాజిక్‌లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన డ్రైవర్లకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడారు. ఆటోలో పరిమితికి లోబడి ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. వాహనం నడిపే ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండి, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలను అతి క్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles