ఆడపిల్లలను బతకనివ్వండి

Sat,November 16, 2019 03:58 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ నవంబర్ 15 : ఆడపిల్లలను బతుకనివ్వండి, రక్షించండి అంటూ ప్రచారం చేస్తూ ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడొద్దని జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న ప్రచారం చేశారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భం గా ఏరియా దవాఖానలో గర్భిణులకు ఆడ పిల్లలతో గులాబీ పూలు అందజేసి ఆడ ప్లిలలను కనండి.. కన్నవారిని బతికించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి నాగమల్లేశ్వరి మాట్లాడారు. ఆడ పిల్లలంటే ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా దేశ ఆర్థిక పరిస్థితులను మార్చే ఒక శక్తిగా చూడాలన్నారు. ఆడ, మగ పిల్లలు సమానమేనని అందరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ, ఆన్‌లైన్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల రక్షాభవన్ కో ఆర్డినేటర్ జ్యోతి, బాలల సంరక్షణ అధికారి బొలగాని నరేశ్, సూపర్‌వైజర్ ఉషారాణి, సోషల్ వర్కర్ కృష్ణవేణి, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సఖి కేంద్రంపై అవగాహన సదస్సు
సమాజంలో జరుగుతున్న గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సఖిసోషల్ కౌన్సిలర్ సరస్వతి అన్నారు. శుక్రవారం స్థానిక వికాస్ డిగ్రీ కళాశాలలో సఖి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సఖి సోషల్ కౌన్సిలర్ సరస్వతి, లీగల్ కౌన్సిలర్ సునీత, పారామెడికల్ సిబ్బంది షాజహాన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కార మార్గాలు, ఆడపిల్లల ఆరోగ్య సంరక్షణపై సంపూర్ణ అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో సఖి సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ బిక్కి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles