గ్రంథాలయం ఒక యోగశాల

Sat,November 16, 2019 03:57 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, నవంబర్ 15: గ్రంథాలయాలు ఒక యోగశాల లాంటివని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఈఎస్‌ఎస్ శర్మ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు అధ్యక్షతన పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో శర్మ హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడుతూ... గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. పూర్వం గ్రంథాలయాల ద్వారా విద్యను అభ్యసించేవారని, సమాజాన్ని అధ్యయనం చేసేవారన్నారు. ఇప్పటికీ గ్రంథాలయాలు ఒక యోగశాలలా పని చేస్తున్నాయని, గ్రంథాలయాలకు తరచుగా వెళ్తే నిశబ్దాన్ని అలవర్చుకుని తమ మేధస్సును పెంచుకోవచ్చన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధపడే వారికి కావాల్సినంత మెటీరియల్ గ్రంథాలయాల్లో లభిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి సైతం పుస్తకాలు చదువుతూ ఉంటారని, ఆయన ఒక మంచి పుస్తక ప్రియుడన్నారు. గ్రంథాలయ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు మాట్లాడుతూ... మహబూబాబాద్ గ్రం థాలయం చాలా చరిత్ర కలిగిందని రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నూతన జిల్లా ఏర్పాటు చేసి జిల్లా గ్రంథాలయాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాఠకులు వెంకట్రాంనర్సయ్య , ఏఎంవో మందుల శ్రీరాము లు, గ్రంథాలయ డైరెక్టర్ నిమ్మల శ్రీను, లైబ్రేరియన్ సీహెచ్ రవి, జీ విజేందర్, ఎం విజయ్, రుద్రారపు వీరేందర్, భూలక్ష్మి, గుమ్మడి వెంకన్న, ముఖేశ్, గుగులోత్ వీరన్న, మురళీకృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాగా శనివారం ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై, పిల్లల్లో పఠనాశక్తి పెంపొందించడం అనే అంశాలపై వకృత్వ పోటీ నిర్వహించనున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles