కేసీఆర్‌తోనే పల్లెల్లో జలసిరులు

Fri,November 15, 2019 04:16 AM

-గోదావరి నీళ్లతో నియోజకవర్గం సస్యశ్యామలం
-ఆలయాల అభివృద్ధికి సర్కారు పెద్దపీట
-డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
-ఉగ్గంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చిన్నగూడూరు,నవంబర్14: సీఎం కేసీఆర్‌తోనే పల్లె ల్లో జలసిరులు కురుస్తున్నాయని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. తన స్వగ్రామమైన ఉగ్గంపల్లిలో గురువారం రూ.40లక్షల తో నిర్మించ తలపెట్టిన రామలింగేశ్వరస్వా మి ఆలయ నిర్మాణానికి భూమిపూజ, రూ.16 లక్షలతో నిర్మాణం పూర్తయిన జీపీ భవనాన్ని రెడ్యా ప్రారంభించా రు. అనంతరం గోదావరి జలాలతో అలుగుపడుతున్న ఊరకుంట చెరువులో స్థానికులతో కలిసి రెడ్యా భూమిపూజ చేశారు. కార్యక్రమానికి వస్తున్న రెడ్యాకు గ్రామస్తు లు ఘనస్వాగతం పలికారు. కళాకారుల ఆటపాటతో అలరించారు. అనంతరం రెడ్యానాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నవీన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులను గ్రామస్తులు సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రెడ్యా మాట్లాడారు. సీఎం కేసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే పల్లెలన్నీ అభివృద్ధి సాధించాయన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 60 శాతం మార్కులు సాధిస్తే, డోర్నకల్ వ్యాప్తంగా ఉన్న 715 చెరువులు, కుంటలకు గోదావరి జలాలతో నింపి వందశాతం మార్కులు సాధించిన తృప్తి కలిగిందన్నారు. గోదావరి జలాలను నియోజవర్గానికి అందించే అదృష్టం కల్పించిన కేసీఆర్‌కు, నా వెన్నంటే ఉంటున్న ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ, పురాతన ఆలయాలకు పూర్వవైభవం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని రెడ్యా అన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అదేవిదంగా నియోజకవర్గంలోని కురవి, నర్సింహులపేట ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా యువ నాయకుడు రవిచంద్ర, ఎంపీలు వల్లూరి పద్మవెంకటరెడ్డి, అరుణ రాంబాబు, జెడ్పీటీసీ మూల సునీతమురళీధర్‌రెడ్డి, పార్టి మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, రాంసింగ్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మంగపతిరావు, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న , సర్పంచ్‌లు బీసుపూలమ్మ, తాళ్లపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ ఉదయమ్మకొమిరెల్లి, మాజి కో ఆప్షన్ సభ్యుడు అయూబ్‌పాషా, నాయకులు మురళీధర్‌రెడ్డి, చెన్నారెడ్డి, దేవేందర్, రాంబాబు, రాం లాల్, వెంకన్న, గంగరాజు, రమేశ్, అంబరీష, మంజుల, యాక్య, జీపీ సెక్రటరి సోమన్న ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles