జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా

Wed,November 13, 2019 03:06 AM

కురవి, నవంబర్‌ 12: ప్రజాప్రతినిధులను కలుపుకుని సీఎం ఆశీస్సులతో మహబూబాబాద్‌ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. కురవి మండలం కందగిరి జాతరకు వచ్చిన ఆమె గుట్ట దిగువన ఉన్న కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిన్నతనం నుంచి జాతర చూస్తున్నానన్నారు. ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం సీఎం కేసీఆర్‌ తెలంగాణలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేవాలయాల్లో ధూపదీపనైవేద్యం కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. కందగిరి నర్సింహస్వామి గుట్ట ఎక్కడానికి మెట్లు లేవని ఇందుకోసం కోటిరూపాయలు మంజూరు చేసి నట్లు తెలిపారు. కందగిరి గుట్ట ఎక్కడానికి ఉన్న రెండు దారులకు బీటీ రోడ్లు నిర్మించడానికకి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుట్ట దగ్గర రానున్న రోజుల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్టు తెలిపారు. గుట్ట వద్ద తాగునీటికి కోసం మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతాంగ సాగునీటి సమస్య తీరిందన్నారు. సాగునీరు ఇస్తానన్న సీఎం కేసీఆర్‌ వాగ్ధానం నెరవేరిదన్నారు.

నీరు రాని ప్రాంతాలకు ఓటీలు నిర్మించనున్నట్లు చెప్పారు. త్వరలో ఎస్సారెస్పీ సమీక్ష నిర్వహించి, చివరి ఆయకట్టు వరరై నీరిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా, మంత్రినయ్యానన్నారు. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. మున్నేరు వాగుపై మరిన్ని చెక్‌డ్యాంలు నిర్మించి ఎకరం పొలం ఎండిపోకుండా రైతులను కాపాడుకుంటామన్నారు. జాతర విజయవంతాకికృషి చేసి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులను అభినందించారు. ఆమె వెంట కురవి జెడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కొంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌, నరహరి, బాదె నాగయ్య, కిశోర్‌ వర్మ, బోడ శ్రీనివాస్‌, కల్లెపు శ్రీను, బండా భిక్షంరెడ్డి, కొప్పుల వెంకట్‌రెడ్డి, మన్యు ప్యాట్నీ పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles