కార్తీకం .. కమనీయం

Wed,November 13, 2019 03:05 AM

మహబూబాబాద్‌ రూరల్‌, నవంబర్‌ 12: కార్త్తీక పౌర్ణమి సందర్భంగా మానుకోట పట్టణంలోని శివాల యం, వేణుగోపాలస్వామి, భక్త మార్కండేయ, అనం తారం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం పట్టణంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తమ ఇళ్ల ఎదుట, ఆలయాల్లో దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామునే లేచి నిత్య పూజలతో పాటు తులసి తల్లికి దీపాలు వెలిగించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ మహాగణపతి పూజ, పుణ్యహవచనము, మహహారుద్రాభిషేకాలు, లక్ష్మీనారాయణుల అరాధన వంటి ప్రత్యేక పూజలు జరిపించారు. కార్తీక పౌర్ణ మి సందర్భంగా ఆలయాల్లో సాయంత్రం వేళ దీపాలు వెలిగించేందుకు వందలాదిగా భక్తులు తరలివచ్చారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles