నేడు కందికొండ జాతర

Tue,November 12, 2019 02:33 AM

-హాజరుకానున్న మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే రెడ్యానాయక్
-స్వామివారిని దర్శించుకోనున్న వేలాది మంది భక్తులు
-ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

కురవి, నవంబర్ 11: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం మండలంలోని కందగిరి లక్ష్మీనర్సింహస్వామి జాతరకు అధికారులు సర్వం సిద్ధం చేశా రు. జాతరకు ముఖ్య అతిథులుగా గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ రెండుసార్లు సమీక్షించారు. ఏటా పౌర్ణమి రోజున జరిగే జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. జాతరలో ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కందికొండ అడ్డరోడ్డు వద్ద ఉన్న వెంచర్‌ను పార్కింగ్‌కు వినియోగించనున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య సేవలందించేందుకు వైద్యసిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. గతంలో గుట్ట దిగువన, పైన నిర్వహించినట్టుగానే ఈసారి గుట్ట మధ్య ప్రాంతంలో కూడా శిబిరాలు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, రెవె న్యూ, అర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎంపీ నిధుల నుంచి మంజూరైన రూ. 2.90లక్షలతో విద్యుత్ సౌకర్యం కల్పించారు.

తీరనున్న భక్తుల కష్టాలు
సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉండే కందికొండ ప్రకృతితో మమేకమై ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్దపెద్ద రాళ్లను సైతం లెక్కచేయకుండా భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని ఏటా దర్శించుకుంటా రు. చిన్న ఆలయాల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభు త్వం, ఎమ్మెల్యే రెడ్యానాయక్ చొరవతో నిధులు మంజూ రు, పనులకు టెండర్ ప్రక్రియ పూర్తియింది. ఈ నేప థ్యంలో వచ్చే సంవత్సరం నుంచి భక్తులకు గుట్ట ఎక్కేందుకు మెట్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ నేపథ్యం లో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జాతర అనంతరం అఖండ జ్యోతి దర్శనం
లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కనుల పండుగగా జరుగనుంది. భక్తులు జాతర తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి ప్రధాన ఆలయం మీద అఖండ దీపాన్ని ప్రధాన పూజారి పురుషోత్తమచార్యులు, కందికొండకు చెందిన కుమ్మరి కులస్తులతో కలిసి వెలిగిస్తారు. ఈ అఖండ దీపం సుమారు చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది.

గుట్టపై విధుల్లో అధికారులు
కందికొండ గుట్టపై జరిగే జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు ఒక్కరోజు ముందుగానే సోమవారం గుట్టపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎంపీడీవో కె.ధన్‌సింగ్, తహసీల్దార్ మాల్యల ఆధ్వర్యంలో ఐకెపీ ఏపీఎం కిరణ్, ఈజీఎస్ ఏపీవో ఏకాంబ్రం, పంచాయతీ కార్యదర్శులు గుట్టమీదకు నడుచుకుంటూ వెళ్తూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రికార్డు చేశారు. అదేవిధంగా ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో గుర్తించారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles