బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా పరామర్శ

Tue,November 12, 2019 02:31 AM

డోర్నకల్, నవంబర్ 11 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన చిలుకోడు గ్రామానికి చెందిన టీ న్యూస్ రిపోర్టర్ దేశాని నగేశ్‌ను ఎమ్మెల్యే రెడ్యానాయక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన సమ్మిట గోపి అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతుండగా అతడిని పరామర్శించి, మెడికల్ సంబంధించిన బిల్లును మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం చిలుకోడు గ్రామనికి చెందిన కోలిపాక అశోక్, రాజేశ్వరి పాల్వంచ పట్టణంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ బాలు నాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నున్నా రమణ, టీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కళ్లెపు సతీశ్ కుమార్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వాంకుడోత్ వీరన్న, సర్పంచ్‌లు గుగులోత్ శ్రీనివాస్, అంగోత్ మోహన్, టీఆర్‌ఎస్ నాయకులు విద్యాసాగర్ రావు, చెరెడ్డి భిక్షారెడ్డి, మేకపోత్తుల శ్రీనివాస్, ధరంసోత్ కృష్ణ, గొర్ల సత్తిరెడ్డి, నందులాల్, నూకల ఉపేందర్, గుండ వెంకన్న, వార్డు సభ్యుడు దేశాని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles