జల వనరులను కాపాడుకోవాలి

Tue,November 12, 2019 02:31 AM

బయ్యారం ,నవంబర్11 { భూగర్భ జల వనరులను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ కుమారి అన్నారు. రాష్ట్రీయ ఆవిష్కర్ సప్తాహ్ - 2019లో భాగంగా మండల కేంద్రంలోని పాఠశాలలో నీటి నాణ్యత-సంరక్షణ అనే అంశంపై సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతి విద్యార్థులు నీటి క్షారత్వం, పరిమాణం, నీటి కాఠిన్యత, విషయాలపై ప్రయోగాలు చేసి తేలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయురాలు ఏ అరుణ కుమారి, వీ మంగమ్మ, జీవీ రమణమ్మ, సుధారాణి, పీ లక్ష్మి, జీ లక్ష్మి, కే అనురాధ, వరలక్ష్మి, అనిత పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles