ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు

Tue,November 12, 2019 02:31 AM

కురవి, నవంబర్ 11: ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు పడడంతో దిగువన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బలపాల శివారు లింగ్యాతండా, గోపతండా గ్రామ పంచాయతీ శివారు హట్యాతండా పరిధిలో ఉన్న ఎస్సారెస్పీ కాల్వలకు సోమవారం గండి పడింది. దీంతో దిగువన ఉన్న గుగులోత్ భోజ్యా, బానోత్ శంకర్, మాలోత్ హరి, బానోత్ హరిచంద్రు, సంతూలాల్, లకా్ష్మ, స్వామి, హరికిషన్, చాంప్లాలకు చెందిన సుమారు 50 ఎకరాల్లోని పత్తి, మిరప, వరి పంట పొలాలు నీట మునిగాయి. గమనించిన రైతులు గండ్లును పూడ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. ఎస్సారెస్పీ కాల్వలలో వస్తున్న నీటి ఉధృతికి గండ్లను పూడ్చే అవకాశం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలాల్లోకి చేరిన కాలువ నీరు
నర్సింహులపేట : ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరిక మేరకు సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. దీంతో 20 రోజులుగా డీబీఎం -60 ప్రధాన కాలువ ద్వారా చెరువుల్లోకి సాగు కోసం నీరు పుష్కలంగా వస్తున్నది. మండలంలోని పెద్దనాగారం గ్రామ శివారులో నీరు ఎక్కువగా వస్తుండంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. దీంతో వరి కోసిన పొలంలో నీరు నిల్వడంతో వరి మొదళ్లను ఆర ఒరలపై బెటుకుట్టున్నారు. చెరువులోకి నీరు వస్తుండండంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles