నాణ్యమైన వైద్య సేవలందించాలి

Tue,November 12, 2019 02:31 AM

-సిబ్బందికి డీఎంహెచ్‌వో శ్రీరాం సూచన
కురవి, నవంబర్ 11: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కురవి మండలం కందికొండ గుట్టపై జరిగే జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్‌వో శ్రీరాం అన్నారు. వైద్య సేవలపై మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రంలోని వైద్య సిబ్బందితో పీహెచ్‌సీలో సోమవారం ఆయన సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. గుట్ట దిగువన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. మేడారం, కురవి జాతరలో ఎలాంటి సేవలందించామో అదేస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. గుట్టపైన, మధ్యలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గుట్టపైకి వెళ్లే రెండు మార్గాలను వైద్య సిబ్బంది దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పదిమంది డాక్టర్లు జాతరలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీసీ గోవర్ధన్, వైద్యులు జితేందర్, శ్వేత, డిప్యూటీ డీఎంహెచ్‌వో, పీవో రాజేష్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles