ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో అక్షర దీపావళి

Tue,November 12, 2019 02:30 AM

పెద్దవంగర,నవంబర్11: మండలంలోని చిట్యాల ప్రాథమిక పాఠశాలలో కార్తీకమాసం సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్(ఎంవీఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులకు అక్షర దీపావళిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కస్తూరి నరేశ్ మాట్లాడుతూ.. సమాజంలోని నిరుపేద విద్యార్థులు, ప్రజల కోసం వందేమాతరం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. అక్షరదీపావళి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో ఆకట్టుకున్నారు. అక్షర దీపావళి సందర్భంగా వేసిన శివుడి చిత్రం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో వందేమాతర ఫౌండేషన్ ప్రతినిధులు జ్యోతి, మమత, ఉపాధ్యాయులు రాయులు, బాబు, మధు, సురేష్, ఆంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles