మట్టెవాడ ఎస్సై దీపక్ సస్పెన్షన్

Mon,November 11, 2019 01:24 AM

వరంగల్ క్రైం, : నిందితులను శిక్షించాల్సింది మరిచి కాపాడటానికి ముడుపులు తీసుకున్న మట్టెవాడ ఎస్సై దీపక్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ రవీందర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ములుగు రోడ్డులోని మారుతి షోరూమ్‌లో స్కాం చోటుచేసుకోగా షోరూం యజమాని అందులో పని చేసే కొంతమందిపై మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టులో ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఇద్దరు దంపతులు ఉండటంతో కేసు నుంచి తప్పించుకోవడానికి కుసుమ అఖిల్ అనే వ్యక్తి ద్వారా ఎస్సై దీపక్‌ను సంప్రదించారు. నిందితులను కేసు నుంచి తప్పించడానికి మధ్యవర్తి ద్వారా ఎస్సై డీల్ కుదుర్చుకున్నాడు. ఈమేరకు మధ్యవర్తి నిందితుల నుంచి కొంతమొత్తం తీసుకునిఎస్సైకి ముట్టజెప్పాడు. అయితే సదురు భార్యభర్తలిద్దరు అఖిల్ తమను ఇంట్లో నిర్బంధించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని హన్మకొండ పీఎస్‌లో ఈనెల 3న ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల్‌పై కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి అఖిల్ తీసుకున్న డబ్బుల్లో ఎస్సైకి సైతం వాటా ఉందని ఒప్పుకోవడంతో నిఘా వర్గాలు ఆరాతీశాయి. అవినీతికి పాల్పడటమే కాకుండా నిందితులను ప్రోత్సహిస్తున్నాడనే విషయం బట్టబయలైంది. దీంతో పోలీస్‌బాస్ శాఖపరమైన చర్యల్లో భాగంగా దీపక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles