ప్రతి ఎకరాకు సాగు నీరు

Sun,November 10, 2019 02:08 AM

-సీఎం కేసీఆర్ ఆశీస్సులతో డోర్నకల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
-ఆకేరు,పాలేరు వాగులపై మరో 12 చెక్‌డ్యాంలు మంజూరు
-ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్

చిన్నగూడూరు నవంబర్ 09 : గోదావరి జలాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే తన లక్ష్యమని డోర్నకల్ రెడ్యానాయక్ అన్నారు. మండలంలోని విసంపల్లి కొత్తచెరువుకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కొద్ది రోజులుగా నీరందించగా అలుగు పడుతున్నది. కాగా ఎమ్మెల్యే రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావ్, స్థానికులతో కలిసి శనివారం చెరువు వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరిపెడ బహిరంగ సభలో గోదావరి జలాలతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం నేడు ప్రతి చెరువు, కుంటకు సాగు నీరందించడం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో కరువు అలుముకున్న నియోజకవర్గాన్ని కేసీఆర్ ఆశిస్సులతో రెండు పంటలకు నీరందిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇప్పటికే సగానికిపైగా గ్రామాల్లోని చెరువులకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు చేరి నిండుకుండలా మారినట్లు తెలిపారు. ఇక వలసలు తగ్గి రైతన్నలు, వ్యవసాయ కూలీలు, కులవృత్తుల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థికంగా బలోపేతం కానున్నట్లు తెలిపారు. ఆకేరు, పాలేరు వాగులపై రూ.45కోట్లతో మరో 12చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించినట్లు తెలిపారు.ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన డోర్నకల్ ప్రజలకు గోదావరి జలాలతో తాగు, సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీర్చి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యం
రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, బ్యాంకురుణాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తూ దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నట్లు స్థానికులకు విరించారు.ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామ గ్రామానికి గోదావరి జలాలు అందిస్తూ పల్లెలకు పూర్వ వైభవం తీసుకువస్తున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా యువనాయకుడు రవిచంద్ర, ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి, జెడ్పీటీసీ మూల సునీతామురళీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాంసింగ్, వెంటేశ్వర్‌రావ్, వైస్‌ఎంపీపీ వీరన్న, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మంగపతిరావ్, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, మూల మురళీధర్‌రెడ్డి, వల్లూరి చెన్నారెడ్డి, దేవేందర్‌రావ్, రంగారెడ్డి, అయూబ్‌పాషా, సర్పంచ్ విద్యులత, ఎంపీటీసీలు వెంగల్‌రావ్, రఘు, పార్టీ గ్రామ అధ్యక్షుడు బొమ్మవెంకన్న తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles