దస్రుతండాకు మహర్దశ

Sun,November 10, 2019 02:05 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, నవంబర్ 09 : తొర్రూరు పట్టణ శివారులోని దస్రుతండాలో సరైన గృహాలు లేవని, తండాకు వెళ్లే రహదారి బురదమయంగా మారిందని రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తండా వాసులు విన్నవించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్‌ఎస్ ఎస్టీ సెల్ నాయకులు జైసింగ్‌నాయక్ ఆధ్వర్యంలో తండా వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. తండాలో సరైన గృహాలు లేని పేదలు ఎంతో మంది ఉన్నారని, వారికి పక్కా గృహాలు నిర్మించుకునేలా చొరవ చూపాలని మంత్రిని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు తండాకు 30 డబుల్‌బెడ్‌రూం గృహాలు, బీటీ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

తనను ఆపదకాలంలో ఆదుకున్న తండావాసులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీకి సుమారు రూ.100కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 600 డబుల్‌బెడ్రూం ఇండ్లు పట్టణానికి మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో తండా వాసులు భూక్య యాకు, దస్రు, సూర్య, భాస్కర్, సుధాకర్, నరేశ్, నవీన్ తదితరులు ఉన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles