వర్చువల్ రియాలిటీతో విప్లవాత్మక మార్పు

Sun,November 10, 2019 02:05 AM

నిట్‌క్యాంపస్, నవంబర్ 09: పూర్తిస్థాయిలో పునాది ఆలోచనలు, వాస్తవిక సాంకేతికత కలయికతో వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ప్రాధాన్యత వస్తుందని ఇన్‌చార్జి డైరెక్టర్, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ ఆనందరాజ్ అన్నారు. శనివారం హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో వర్చువల్ రి యాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశంపై ఐదు రోజు ల శిక్షణా కార్యక్రమం ప్రారంభం అయింది. నిట్ సెమినార్ కాంప్లెక్స్‌లోని ఖురానాహాల్‌లో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ప్రొఫెసర్ ఆనందరాజ్ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వర్చువల్ రియాలిటీతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చని తెలిపారు. సాంకేతిక సాయంతో విద్యావిధానం లో మార్పుల ప్రక్రియకు తోడ్పడుతున్నదని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రొఫెసర్ డీఎస్ కేశవరావు మాట్లాడుతూ వీఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా మార్పులు జరుగుతున్నాయని అన్నారు. సులభతర విద్యావిధానంతో వర్చువల్ రియాలిటీ ప్రత్యేకతను సంతరిం చుకున్నదని తెలిపారు. ఈ శిక్షణ కోసం దేశంలోని పలు విద్యాసంస్థ నుండి 108 మంది పరిశోధకులు హాజరయ్యారని కోఆర్డినేటర్ డాక్టర్ బీ స్ఫూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం అధిపతి డాక్టర్ రాజా విశ్వనాథన్, అధ్యాపకులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles