బియ్యం నేరుగా పాఠశాలకు అందించాలి

Sat,November 9, 2019 05:53 AM

మహబూబాబాద్ రూరల్ నవంబర్ 08 : మధ్యాహ భోజన బియ్యాన్ని నేరుగా పాఠశాలలకే అందించాలని టీపీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సోమ గోవర్దన్ కోరారు. టీపిటీఎప్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ గోవర్దన్ మాట్లాడుతూ మధ్యాహ భోజన బియ్యాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలో ఉన్న ఎంఆర్సీ నుంచి ప్రతి నెలా తీసుకుపోవాల్సి వస్తోందని చెప్పారు ఈ విధానం వల్ల మహిళా ప్రధానోపాధ్యాయులకు, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ప్రతి నెలా జిల్లా కేంద్రంకు రావడం వల్ల సమయం వృథా అవుతుందన్నారు. సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా బోధనకు అంతరాయం కలుగుతుందన్నారు. నేరుగా బియ్యం పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం ఉపేందర్‌రెడ్డి, హేమాద్రి పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles