ఆయుష్ జిల్లాగా తీర్చిదిద్దాలి

Fri,November 8, 2019 04:16 AM

-కోతులను తిరిగి వనంలోకి పంపించాలి
-వన నర్సరీని సందర్శించిన కలెక్టర్ శివలింగయ్య
కేసముద్రంటౌన్, నవంబర్07: అడవులు ఎక్కువగా ఉన్న మానుకోట జిల్లాలో ఔషధ మొక్కలు ఎక్కువగా పెంచి ఆదర్శ ఆయుష్ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. గురువారం మండలంలోని బిచ్చానాయక్ తండా సమీపంలో ఉన్న వన నర్సరీలో అటవీ, ఆయుష్ శాఖల సం యుక్త ఆధ్వర్యంలో అడుగడుగునా ఔషధ మొక్కలు అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు మొక్కలు నాటారు. వన నర్సరీలో అయుష్ డాక్టర్లు, అటవీ శాఖ అధికారులతో కలిసి తిరిగారు. ఔషధ మొక్కలతో కలిగే లాభాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరంమాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు పెంచాలన్నారు. వైల్డ్ ఫ్రూట్ బేరింగ్ మొక్కలు పెంచడంతో కోతుల సమస్య పరిష్కారమవుతుందన్నారు. దోమలను నివారించే మొక్కలు పెంచి ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచాలని ఆయుష్ డాక్టర్లకు సూచించారు. ప్రతి చిన్న విషయానికి అలోపతి డాక్టర్ వద్దకు వెళ్లకుండా అయుర్వేదం ద్వారా జబ్బును తగ్గించుకునేలా మొక్కలు నాటాలన్నారు. జిల్లా కేంద్రంలో స్మృతి వనం, లంచ్ స్పేస్ పార్క్‌లో మొక్కలను ఏర్పాటు చేసి వాటి వలన కలుగు ఉపయోగాలు వివరించే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్, జెడ్పీ సీఈవో సంధ్య, డీఆర్‌డీవో సూర్యనారాయణ, డీఏవో ఛత్రునాయక్, డీపీఆర్‌వో అయూబ్ అలీ, పశుసంవర్థకశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి కొముర య్య, ఆర్‌డీవో ఈశ్వరయ్య, ఆయుష్ డాక్టర్లు నిరంజనీ, కిరణ్‌కుమార్, ఆనంద్, సురేష్, విజయలక్షీ, సూరయ్య ఉన్నారు.

పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు రచించాలి
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అధికారితో జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలపై పలు సూచనలిస్తూ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా ఏర్పడి మూడేళ్లయినా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి జరగలేదన్నారు. వీరభద్రస్వామి దేవాలయం, అనంతారం వెంకటేశ్వరాలయంలో పర్యాటకులకు వసతి కల్పించామని, డోర్నకల్‌లో కళాతోర ణం నిర్మించామన్నారు. రూ. 12 లక్షలతో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో పర్యాటక పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో హరితహోటల్ ఏర్పాటుకు కురవి రోడ్డులోని నూతన కలెక్టరేట్ భవన సముదాయాల సమీపంలో రెండెకరాల భూమిని కేటాయించాలని ఆర్డీవో కొమరయ్యను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర పర్యాటకశాఖ సంచాలకులు మనోహర్‌ను ఫోన్‌లో కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గూడూరులోని భీమునిపాదం, బయ్యారం పెద్దచెరువు, గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయం, గార్ల మర్రిగూడెం వెంకటేశ్వరస్వా మి ఆలయం, తొర్రూరులోని మాటేడును పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అధికారి శివాజీ, జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్, ఆర్డీవో కొమురయ్య పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles