పారిశుధ్యంపై చైతన్యం పెంచాలి

Thu,November 7, 2019 02:08 AM

-తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి
-ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
-పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ స్థలాలను గుర్తించాలి
-కలెక్టర్ శివలింగయ్య
-తొర్రూరులో అభివృద్ధి పనుల పరిశీలన

తొర్రూరు, నమస్తే తెలంగాణ, నవంబర్ 6 : పారిశుధ్యం విషయంలో మున్సిపాలిటీలో తగినంత పురోగతి కన్పించడం లేదు. ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టండి అని మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. తొర్రూరు మున్సిపాలిటీలో బుధవారం శానిటేష న్, డంపింగ్‌యార్డులకు చెత్త రవాణా, ఘన వ్యర్థ నిర్వహణ, టీఎస్‌యూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నేరుగా పరిశీలన చేసిన ఆయన అధికారులతో సమీక్షిం చారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి దానిని డంపింగ్‌యార్డులో వేయాలని సూచించారు. ఘన వ్యర్థ నిర్వహణపై సమీక్షించి పనులు సక్రమంగా సాగడం లేదని అసంపృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు చుట్టూ కంచె ఏర్పాటు చేసి వర్మికంపోస్ట్ తయారీకి షెడ్ ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్‌యార్డు లో దుర్వాసన రాకుండా సువాసన వెదజల్లే మొక్కలు పెంచాలని అదేశించారు. పారిశుధ్య సిబ్బందికి నాణ్యమైన ఆఫ్రాన్, బూట్లు, మాస్క్, గ్లౌజులు అందజేయాలన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అదేవిధం గా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామ ని ప్రచారం చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పది రిక్షా లు, ఒక ట్రాక్టర్ ఉండగా ప్రతి రిక్షా, ట్రాక్టర్‌లో తడి, పొడి చెత్త ను వేర్వేరుగా సేకరించేలా చూడాలన్నారు. ప్రతి వార్డులోని గోడలపై శానిటేషన్ సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్‌ను, సైకిల్‌రిక్షాలపై వార్డుల నంబర్లు రాయించాలన్నా రు. త్వరలో మున్సిపాలిటీకి పది ట్రాలీలు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వేస్టే సేకరణకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలకు ఏ రకమైన ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావచ్చో ప్రజలకు అవగాహన కల్పించేలా మున్సిపాలిటీ పరిధిలో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొర్రూరును ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కమిషనర్‌తో పాటు సిబ్బంది కృషి చేయాలన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి...
తొర్రూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి రూ.20కోట్ల తో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పను ల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పట్టణంలో మూడు ప్రధాన జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టే విషయంపై కలెక్టర్ సమీక్షించారు. పట్టణంలోని 13 ఎకరాల్లో ఉన్న యతిరాజారావు స్మారక పార్క్‌ను ఆయన పరిశీలించారు. పార్క్ ఆవరణలో వాకింగ్ ట్రాక్, ఇండోర్ స్టేడియం, స్విమింగ్‌పూల్, ఆడిటోరియం, చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులను త్వరతగతిన చేపట్టాలని సూచించారు. పట్టణంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీవో సూర్యనారాయణ, ఆర్డీవో ఈశ్వరయ్య, ఎంపీవో ఆంజనేయస్వామి, మున్సిపల్ కమిషనర్లు ఇంద్రసేనారెడ్డి, బాబు, తహసీల్దార్ రమేశ్‌బాబు, జెడ్పీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles