-జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 06: పదో తరగతి విద్యార్థులకు సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ వారి ద్వారా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల పేపర్లను దిద్ది, ఫలితాలను వెంటనే తెలియజేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు, స్టూడెంట్స్ అలవెన్స్, పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి పులి దేవేందర్, జిల్లా అధ్యక్షుడు బోడ రాంజీ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత సురేశ్, టీపీటీఎప్ నాయకులు, యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.