అన్నదాతల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్‌

Wed,October 23, 2019 01:35 AM

మరిపెడ నమస్తేతెలంగాణ, అక్టోబర్‌ 22 : అన్నదాతల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్‌ అని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌ అన్నారు. మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాం దగ్గర ఎస్సారెస్పీ డీబీఎం-60 ప్రధాన కాల్వలో గోదావరి జలాలు పారుతుండగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ స్థానిక నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యాను స్థానిక రైతులు సన్మానించారు. అనుకున్న సమయానికి గోదావరి నీళ్లు రప్పించిన ఎమ్మెల్యే రెడ్యాకు ఈ ప్రాంత రైతులం ఎంతో రుణ పడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మాట్లాడుతూ దీపావళి లోపే డోర్నకల్‌ నియోజకవర్గానికి గోదావరి జలాలను విడుదల చేస్తామని చెప్పిన మాటను సీఎం కేసీఆర్‌ నిరూపించుకున్నారన్నారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సారెస్పీ డీబీఎం-60 ప్రధాన కాల్వకు నిత్యం వెయ్యి క్యూసెక్కుల నీరు వస్తుందని ఆ నీటిని ఎస్సారెస్పీ ఇంజినీర్లు, ఇరిగేషన్‌శాఖ అధికారులు నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలకు తరలిస్తారని చెప్పారు. ప్రతి చెరువు, కుంట నింపేలా చర్యలు తీసుకోవాలని ఎస్సారెస్పీ ఇంజినీర్లు శ్రీనివాస్‌, మోతిలాల్‌ను రెడ్యా ఆదేశించారు. ఈ ప్రాంత రైతులు కరువు రక్కసితో కుమలి పోతున్నారన్నారు. రైతన్నల బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ను పలు మార్లు కలిసి గోదావరి నీటి విడుదలకు కృషి చేసిన విషయాన్ని ఉదహరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తోనే తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగు నీరు అందించొచ్చని భావించి దాన్ని ప్రారంభించి మూడేళ్లకే పూర్తి చేసిన ఏకైక సీఎం కేసీఆరే అని అన్నారు.

దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ మండలాలోని అన్ని గ్రామాలకు, చిన్నగూడూరు మండలంలోని విస్సంపల్లి, ఉగ్గంపల్లి గ్రామాలకు డీబీఎం-60 ప్రధాన కాల్వ ఉప కాల్వల ద్వారా చెరువులను, కుంటలను నింపనున్నట్లు చెప్పారు. డీబీఎం-48తో కురవి, డోర్నకల్‌ మండలంలోని పూర్తి గ్రామాలు, చిన్నగూడూరు మండలంలోని జయ్యారం, చిన్నగూడూరు, గుండంరాజుపల్లి గ్రామాల చెరువులను నింపేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డోర్నకల్‌ యువ నేత డీఎస్‌ రవిచంద్ర, ఎంపీపీ గుగులోత్‌ అరుణ, ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్‌, డీఈఈ మోతిలాల్‌, ఓడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ బాల్ని మాణిక్యం, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌ సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ పానుగోతు రాంలాల్‌, నాయకులు తేజావత్‌ రవీందర్‌నాయక్‌, రాంబాబు, మరిపెడ పట్టణ అధ్యక్షుడు ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, చిన్నగూడూరు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డీఎస్‌ రాంసింగ్‌, మాజీ ఎంపీటీసీలు అంబరీష, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. అర్చకులు నల్లాన్‌ చక్రవర్తుల లక్ష్మీనర్సింహాచార్యులు, లక్ష్మాణాచార్యులు నది జలాలకు వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles