గిన్నిస్ కోసం సైకత శిల్పం కొలతలు

Sat,October 19, 2019 03:07 AM

కురవి, అక్టోబర్ 18: మండల కేంద్రానికి చెందిన నీలం శ్రీనివాసులు తయారుచేసిన టూ డైమెన్షనల్ సైకత శిల్పాన్ని గిన్నిస్ రికార్డు కోసం శుక్రవారం అధికారుల సమక్షంలో కొలతలు తీసుకున్నారు. కురవి ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సైకత శిల్పాన్ని ప్రదర్శించారు. తొలి టూడైమెన్షనల్ సైకత శిల్పంగా ఇప్పటికే ఏసియా, ఇండియా బుక్ రికార్డులు సొంతం అయిన సంగతి పాఠకులకు తెలిసిందే. గిన్నిస్ రికార్డు కోసం సైకత శిల్పం తయారుచేసిన సమయంలో విధులు నిర్వర్తించిన తహసీల్దార్ టీ శ్రీనివాస్, ఎంపీడీవో కే ధన్‌సింగ్‌ల సమక్షంలో ప్రభుత్వ సర్వేయర్ ఖాజా ఫరీదుద్ధీన్ కొలతలు వేయించారు. ఇట్టి రికార్డులను గిన్నీస్ వారికి పంపనున్నట్లు నీలం శ్రీనివాసులు తెలిపారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles