జాతీయ పంచాయతీ అవార్డుకు ఎంపికైన జెడ్పీటీసీ శ్రీనివాస్

Sat,October 19, 2019 03:07 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 18: జాతీయ స్థాయిలో 2019లో కేంద్ర ప్రభుత్వం బహూకరించే పంచాయతీ అవార్డుకు తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఎం రఘునందన్‌రావు శుక్రవా రం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రా మసభ పురస్కార్, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డులతో పాటు జాతీ య పంచాయతీ-2019 కేంద్ర ప్రభు త్వ అవార్డులకు సంబంధించి రాష్ట్రం నుంచి ఎంపికైన గ్రామాలు, మండలాలు, జిల్లాలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచ్ జాబితాను అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 23న ఢిల్లీలోని జాతీయ వ్యవసాయ సైన్స్ కాంప్లెక్స్‌లోని సుబ్రహ్మణ్యం హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో తొర్రూరు జెడ్పీటీసీ శ్రీనివాస్ అవార్డును అందుకోనున్నారు.

మహబూబాబాద్ జిల్లా నుంచి కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామ ఉప సర్పంచ్ భూక్య శ్రీనివాస్ సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉత్తమ యువజన అవార్డు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డులను మంగళపల్లి శ్రీనివాస్ గతంలో అందుకున్నారు. సామాజిక, తెలంగాణ మలి దశ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఈయనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరు మండల టీఆర్‌ఎస్ జెడ్పీటీసీగా పోటీచేసే అవకాశం కల్పించడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను మండలంలో సమర్థవంతంగా అమలు జరిగేలా అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలను భాగస్వామ్యం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. జాతీయ పంచాయతీ అవార్డుకు తాను ఎంపిక కావడంపై శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేలా నిత్యం కృషి చేస్తానని, మండల అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles