ఎమ్మెల్యే గండ్రకు పీపుల్స్ లీడర్ అవార్డు ప్రదానం

Sat,October 19, 2019 03:06 AM

శాయంపేట, అక్టోబర్ 18 : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ వారి ఆధ్వర్యంలోభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి పీపుల్స్ లీడర్ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టర్ ప్రతినిధులు ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డి, వరంగల్‌రూరల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతిని ఈ సందర్భంగా సన్మానించారు. సభలో గండ్ర దంపతులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో, వరంగల్ రూరల్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అమెరికాలో ఇటీవల 42 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా పూర్తిచేసి గండ్ర జ్యోతి మారథాన్ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ అధ్యక్షుడు వీరేందర్, దేవిరెడ్డి, జితేందర్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జగపతిరెడ్డి, నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన 300 మంది నాయకులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles