విద్యార్థుల సౌకర్యార్థమే వసతిగృహాలు

Fri,October 18, 2019 03:36 AM

-భద్రాద్రి కొత్తగూడెం ఐటీడీఏ పీవో గౌతమ్
బయ్యారం, అక్టోబర్ 17 : గిరిజన విద్యార్థుల సౌకర్యం కోసమే వసతి గృహాల ఏర్పాటు అని భద్రాద్రి కొత్తగూడెం ఐటీడీఏ పీవో గౌతమ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించి పనులు పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులకు ఇబ్బందులు కలుగకుండా వసతి గృహాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. అనంతరం బయ్యారం పరిసర ప్రాంతాల నుంచి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారనే సమాచారాన్ని సేకరించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డిసెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీటీడీవో ప్రియాంక, కాంట్రాక్టర్ తిరుమల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles