కేసముద్రం మార్కెట్‌కు పోటెత్తిన పెసర

Fri,October 18, 2019 03:35 AM

-275 క్వింటాళ్ల పెసర రాక
కేసముద్రంటౌన్, అక్టోబర్17: మార్కెట్‌కు గురువారం పెసర పోటెత్తింది. గురువారం ఒక్కరోజే 275 క్వింటాళ్ల పెసర మార్కెట్‌కు విక్రయానికి వచ్చింది. కేసముద్రం మార్కెట్‌లో క్వింటాల్ రూ.7050కు ప్రభుత్వ మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోలు చేస్తుంది. సెప్టెంబర్ 20న కొనుగోలు కేంద్రం ప్రారంభం అయిన నాటి నుంచి ఈ నెల 16 వరకు మార్క్‌ఫెడ్ అధికారులు 338 క్వింటాళ్ల పెసరను కొనుగోలు చేయగా, గురువారం 180 క్వింటాళ్ల పెసరను కొనుగోలు చేశారు. ఇది ఇలా ఉండగా గురువారం ఒక్కరోజే మార్కెట్‌కు 275 క్వింటాళ్ల పెసర విక్రయానికి రావడంతో మార్కెట్ అధికారులు, మార్క్‌ఫెడ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి మద్దతు ధరకు ప్రభుత్వం రంగ సంస్థకు అమ్మి సొమ్ము చేసుకోవాలని విక్రయానికి తీసుకవచ్చినట్లు భావించి విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలానికి చెందిన మేడిదపెల్లి రైతులు పెసరను తీసుకువచ్చినట్లు గుర్తించి, తిర్మలాయపాలెం మండల వ్యవసాయ అధికారిని వివరణ కోరారు. అదే గ్రామానికి చెందిన సుమారు 15 మంది రైతులు ఒకే రోజు పెసరను తీసుకువచ్చినట్లు నిర్ధారణ కావడంతో పెసరను కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. అయితే ఖమ్మం, మహబూబాబాద్ మార్కెట్‌లల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేసిన నేపథ్యంలో కేసముద్రం మార్కెట్‌కు పెసరను విక్రయానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. .

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles