పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Fri,October 18, 2019 03:35 AM

-డీఆర్‌డీవో సూర్యనారాయణ
కురవి, అక్టోబర్ 17: ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఆర్‌డీవో సూర్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ ఫీల్డు అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఒక ఇంకుడుగుంత ఉండేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే గ్రామానికో నర్సరీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. 30రోజుల ప్రణాళిక నిరంతరంగా కొనసాగించాలని, అప్పుడే గ్రామాల్లో అనుకున్న అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే ధన్‌సింగ్, ఈజీఎస్ ఏపీవో ఏకాంబ్రం, ఐకేపీ ఏపీఎం కిరణ్ పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles