జిల్లాలో మోస్తరు వర్షం

Fri,October 18, 2019 03:34 AM

మహబూబాబాద్,నమస్తే తెలంగాణ / మరిపెడ నమస్తేతెలంగాణ/గంగారం, అక్టోబర్17 : జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి వివిధ మండలాల్లో చెదురు మదురుగా జల్లులు పడుతూ అక్కడక్కడ వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 6.28మిల్లీమీటర్లు వర్షాపాతం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగూడ 35.6 మి.మీ, బయ్యారం 1.0 మిమీ, గార్ల 18.6మిమీ, డోర్నకల్ 11.2మిమీ, గూడూరు 9.0మిమీలుగా నమోదు కాగా గురువారం మహబూబాబాద్, బయ్యారం మండలాల్లో చెదురు మదురు వర్షం కురిసింది. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిరపతోటలు, మొక్కజొన్న చేలు వర్షాలకు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. స్థానిక కార్గిల్ సెంటర్లోని నేషనల్ హైవేపై భారీగా వర్షపు నీరు నిలిచింది.

దీంతో సమీప ఇళ్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా పట్టణంలోని ఈద్గా బజార్లో రోడ్డుపై నీరు ప్రవహించింది. మరిపెడ ఊళ్లో ఆర్టీసీ బస్సు వర్షపు నీరు నిల్వ ఉండడంతో దిగబడింది. ఆ బస్సును బయటికి లాగేందుకు ప్రజలు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ వర్షం కొంత మోదం కలిగిస్తుండగా పత్తి, మిరప పంటలకు తీరని నష్టం మిగిల్చింది. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురువడంతో ప్రజలు ఒకే రోజు మూడు కాలాలను చూశారు. గంగారం మండలంతో పాటు పందెం, మడగూడెం, బావురుగొండ, పుట్టలభూపతి గ్రామాల్లో గురువారం సాయంత్రం భారీవాన కురిసింది. వాగులు, కుంటలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో పంటపొలాలకు జీవం పోసినైట్లెందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles