పంచాయతీ సిబ్బందికి సర్కారు భరోసా!

Thu,October 17, 2019 03:11 AM

-వేతనాల పెంపుతోపాటు జీవిత బీమా
-ప్రతి నెలా రూ. 8500 చెల్లింపు
-జిల్లాలో 1280 మందికి లబ్ధి
-రూ. రెండు లక్షల బీమాతో ధీమా
-ఏటా ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు
-హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు

బయ్యారం, అక్టోబర్ 16: పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్న పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుంది. గత పాలకుల హయాంలో తీవ్ర నిర్లక్షానికి గురైన జీపీ సిబ్బంది జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారు. నూతన పంచాయతీల ఏర్పాటుతో ఇప్పటికే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. పల్లె ప్రగతిలో కీలకమైన సిబ్బంది జీతాల పెంపు, బీమా పథకంతో వారు మరింత ఉత్సాహంగా పని చేయడంతో పంచాయతీల అభివృద్ధిలో మరింత వేగం పెరగనుంది. జిల్లాలోని 16 మండలాల్లో 461 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 20 రకాల పనులు నిర్వహిస్తున్న 1280 మంది పార్ట్ టైం, ఫుల్ టైం, కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. వారి జీవితాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ సోమవారం జీవో నెంబర్ 63ని విడుదల చేసింది. దీంతో ఇక పంచాయతీల్లో పని చేస్తున్న పార్ట్ టైం, ఫుల్ టైం సిబ్బందికి ప్రతి ఒక్కరికి 8500 రూపాయల జీతం అందనుంది. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం అమలుచేసిన 30 రో జుల ప్రగతి ప్రణాళిక సైతం పంచాయతీ సిబ్బంది కృషితో విజయవంతం కావటంతో సిబ్బందికి మ రో కానుకను ప్రభుత్వం అందించింది. పంచాయ తీ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్కిడే పేరిట 2 లక్షల రూపాయల బీమా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రీమియంను సైతం ప్రభుత్వమే చెల్లించనుంది. అందురు సంబధించిన విధివిధానాలను ప్రభుత్వం త్వరలో రూపొందించనుంది.

పంచాయతీల్లో కార్మికుల పాత్ర కీలకం
పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో కీలకం కావటంతో వారిని ప్రభుత్వం గుర్తించింది. ఊరు నిద్రలేవక మందు రోడ్లు ఊడ్చి, కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు, ట్యాంకులకు నీటిని ఎక్కించి ఇంటింటికి తాగు నీరు అందించే పంపు ఆపరేటర్లు, రాత్రిపూట దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్లు, పన్నుల వసూళ్ళకు పరుగులు పెట్టే కారోబార్లు, బిల్ కలెక్టర్లు ఇలా నిత్యం ఎవ్వరి పనుల్లో వారు నిమగ్నమై గ్రామీణ వ్యవస్థను మందుకు తీసుకె ళ్తూ ప్రజా అభివృద్ధి కోసం పాటుపడుతుంటారు.

సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పారిశుధ్య కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్త మౌతున్నాయి. గత పాలకుల హయాంలో చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడ్డ పంచాయతీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ నిర్ణయం భరోసాను కల్పిస్తుంది. గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా చిల్లిగవ్వ జీతాలు పెంచిన పాపాన పోలేదని కార్మికులు వాపోతున్నారు. అంతేకాకుండా పంచాయతీ పన్నులు వసూలు అయితేనే వారి జీతాలు చెల్లించేవారు. దీంతో నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడేవారు. అయితే ప్రభుత్వం పంచాయతీ బిల్లులతో సంబంధం లేకుండా 8500రూపాయల జీతం అందించనున్నట్లు జీవో విడుదల చేయటంతో పంచాయతీ కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles