అనుమతులు లేని బయో మందులతో మోసపోవద్దు

Thu,October 17, 2019 03:09 AM

మహబూబాబాద్,నమస్తే తెలంగాణ,అక్టోబర్ 16: రాష్ట్రంలో ప్రభుత్వ అనుమతులు లేని శ్రేష్ట ప్లాంటా బయో మందులు కొని మోసపోవద్దని వ్యవసాయ అధికారులు సర్సంపేట ఏడీఏ వెంకటేశ్వరరావు, మహబూబాబాద్ ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏవో తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం సర్సంపేట తదితర ప్రాంతాల్లో తిరుగుతూ శ్రేష్ట ప్లాంటా ప్రాడెక్ట్‌ను విక్రయిస్తుండగా ఏజెంటును పట్టుకుని విచారించారు. ఈ మేరకు మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలో గల షాపును బుధవారం తనిఖీ చేసి, 20 బాటిళ్ల బమోమందులను స్వాధీనం చేసుకొని జిల్లా అధికారులకు అప్పగించారు. గతంలో కూడా అనుమతి లేని బయో మందులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా గుంటూరు నుంచి ఇక్కడకు అనుమతులు లేకుండా తీసుకొచ్చి రైతులకు అమ్ముతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వరంగల్ రూరల్, ములుగు, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలిసిందన్నారు. రైతులు బయోమందుల విక్రయాలకు ఆకర్శితులై మోసపోవద్దని హెచ్చరించా రు. ఈ తనిఖీల్లో ఏవోలు కృష్ణకుమార్, సంపత్‌రెడ్డి, ఏఈవోలు అశోక్, వివేకర్ పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles