క్లస్టర్ల వారీగా ప్రణాళికలు రూపొందించాలి

Thu,October 17, 2019 03:09 AM

-కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ 16 : క్లస్టర్ల వారీగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వానకాలం, యాసంగి పంటలు, ఉద్యాన వనాలు, పట్టు పరిశ్రమలు తదితర అంశాలపై క్లస్టర్ల వారీగా తయారు చేయాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగుకు అనువైన భూమి, పంట వివరాలు, సాగు చేసే రైతుల వివరాలు, నీటి లభ్యత, మార్కెటింగ్ తదితర వివరాలను ప్రణాళికలో పొందుపర్చాలని ఆదేశించారు. వీటి ఆధారంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా హార్టికల్చర్ సాగుకు మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతి రైతూ ఫసల్‌బీమా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. తక్కువ నీటి వినియోగం, తక్కువ ఖర్చుతో దిగుబడి పొందేలా అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఏవో ఛత్రునాయక్, డీఆర్‌డీవో సుర్యనారాయణ, వ్యవసాయశాఖ అధికారులు ఏవోలు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles