మేడారంలో భక్త్తుల సందడి

Thu,October 17, 2019 03:08 AM

తాడ్వాయి, అక్టోబర్16: వనదేవతలైన మేడారం సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం సారలమ్మ గద్దెపై కొలువుదీరే రోజు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా సమీప రాష్ర్టాలైన చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం వాగు ఒడ్డున గల జంపన్నగద్దెకు, నాగులమ్మ గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలపై పసుపు,కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సాంప్రదాయ పద్ధతులతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తల్లుల మొక్కులకు అనుగుణంగా యాటపోతులు, కోళ్లు సమర్పించి గద్దెల పరిసరాలతో పాటు చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చెట్లకింద విడిది చేశారు. వంటలు వండుకుని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో విందుభోజనాలు చేశారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles