రవాణా విషయంలో ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు

Wed,October 16, 2019 02:35 AM

మహబూబాబాద్ రూరల్ అక్టోబర్ 15 : ఆర్టీసీ సమ్మె కారణంగా రవాణా విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించ కూడదని సీఐడీ ఐజీ పీ ప్రమోద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రమోద్‌కుమార్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం అయినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలిసుకు న్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరకుండా చూడాలన్నారు. ఎన్ని బస్సులు నడుస్తున్నాయి? రోజుకు ఎంతమంది ప్రయాణిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా సరిహద్దులో మావోల కదలికలపై అడిగి తెలుకున్నారు. మావో కదలికలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాలన్నారు. సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ నరేశ్‌కుమార్, సీఐ రవికుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles