ఆర్టీసీ సమ్మెను మరిచిన ప్రయాణికులు

Wed,October 16, 2019 02:34 AM

మహబూబాబాద్,నమస్తే తెలంగాణ/ నెల్లికుదురు. అక్టోబర్ 15: ఆర్టీసీ కార్మికుల సమ్మె పదకొండో రోజుకు చేరింది. ఉన్నతాధికాలు తీసుకుంటున్న చర్యలతో ప్రయాణికులు సమ్మె అనే విషయమే మరిచిపోయారు. పోలీసు సిబ్బంది సహకారంతో మహబూబాబాద్, తొర్రూర్ డిపోలకు సంబంధించిన మొత్తం 132 ఆర్టీసీ బస్సులు నడిపించారు. ఇందులో మహబూబాబాద్ డిపోకు చెందినవి 46 ఆర్టీసీ, 14 ప్రైవేట్ బస్సులు కాగా తొర్రూరు డిపోకు సంబంధించినవి 51 ఆర్టీసీ, 21 ప్రైవేటు బస్సులు నడిపించారు. ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేమంగా చేరవేశారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలురాజకీయ పార్టీల నాయకులు మద్దతు పలికారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం బస్‌డిపోను ముట్టడి చేశారు. అనంతరం మదర్ థెరిస్సా విగ్రహం నుంచి బస్‌డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న 19 మంది పంచాయతీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆర్టీసీ విధులకు పంపినట్లు ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles