టెండర్లలో అవకతవకలకు తావివ్వొద్దు

Tue,October 15, 2019 03:35 AM

-పారదర్శకంగా మద్యం దుకాణాలకు డ్రా
-దరఖాస్తు దారుల సమక్షంలోనే నిర్వహణ
-కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
-అప్లికేషన్ల స్వీకరణ కేంద్రాల పరిశీలన
-సోమవారం నాటికి 385 అర్జీలు
-18న మానుకోటలోని ఏబీ ఫంక్షన్ హాల్‌లో 52 దుకాణాలకు డ్రా
-ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

మహబూబాబాద్,నమస్తే తెలంగాణ,అక్టోబర్ 14 : ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 100 శాతం బస్సులు నడిచేలా కలెక్టర్లు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పీ అజయ్ కుమార్, చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మంత్రి మాట్లాడుతూ డిపోలో ఉన్న అన్ని బస్సులు నడిచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రయాణికుల బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మనదేనని, శిక్షణ పొందిన నైపుణ్యత, అనుభవజ్ఙులైన డ్రైవర్లు, కండక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలని అన్నారు. టికెట్ కటింగ్ కరెక్ట్‌గా జరిగేలా చూడాలని తెలిపారు. జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించుకోవాలని టెక్నికల్‌కు సంబంధించిన సమస్యలను నోడల్ అధికారులు పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. డిపోలో ఉన్న ప్రింటెడ్ టికెట్లను వినిమోగించుకోవాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను నియమించుకోవాలని, ప్రజల్లో ఉన్న కండక్టర్, డ్రైవర్ అనే అపోహలను తొలగించాలని చెప్పారు.

అన్ని బస్సులు నడిచేలా చర్యలు
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని రెండు డిపోలు(మహబూబాబాద్, తొర్రూరు) ఉండగా మహబూబాబాద్‌లో 71, తొర్రూరులో 88 బస్సులు ఉన్నాయని, 100శాతం నడిచేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ వీడిమో కాన్ఫరెన్స్ నిర్వహించి బస్సుల్లో టికెటింగ్ సరిగ్గా జరిగేటట్లు చూడాలని, ఒక్క ట్రిప్పులో ఎంత డబ్బులు వచ్చాయో నమోదు చేయాలని తనిఖీ అధికారులు మండలాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే బస్సులు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ కోటిరెడ్డి, డీటీవో భద్రునాయక్, డీఎస్పీలు నరేశ్‌కుమార్, మదన్‌లాల్, తొర్రూరు, మహబూబాబాద్ డిపో మేనేజర్లు సారయ్య, మహేశ్‌కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles