జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Tue,October 15, 2019 03:32 AM

మహబూబాబాద్, నమస్తేతెలంగాణ(మరిపెడ నమస్తేతెలంగాణ/కేసముద్రం టౌన్, అక్టోబర్ 14: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమానికి మానుకోటతో పాటు మరిపెడ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు గంధసిరి రవి మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. జీవో 239 రద్దు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, వాటిని అన్ని దవాఖానల్లో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరిపెడ నుంచి ధర్నాకు తరలిన వారిలో జర్నలిస్టులు తిరుమల్, వెంకటేశ్వర్లు, అశోక్, అక్తర్‌పాషా, లింగస్వామి, రాజేశ్, జిన్న లచ్చన్న తదితరులు ఉన్నారు. అలాగే కేసముద్రం మండలం నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండి సంపత్‌కుమార్, రామాచారి, బండారు మధు, నూకల యశ్వంత్, చందా గోపి, పిన్ని రాము, ఎసల్ల సత్యనారాయణ, కొత్తపల్లి రాములు, కిరణ్ తదితరులు ఉన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles