కాళేశ్వరంలో భక్తుల రద్దీ..

Mon,October 14, 2019 04:06 AM

కాళేశ్వరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరి తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు దీపాలు వదిలారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకుని ఆలయంలోని సుబ్రహమణ్య స్వామి వారి ఆలయంలో కాలసర్ప దోష నివారణ పూజలు, నవగ్రాహాల వద్ద శని పూజలు, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం లక్ష్మీపంప్‌హౌస్, సరస్వతీ బరాజ్‌ను సందర్శించారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles